సోనమ్ బజ్వా
పంజాబీ సినిమాలో Best of Luck (2013)తో కెరీర్ ప్రారంభించిన సోనమ్ బజ్వా తమిళ, తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో కూడా పనిచేస్తున్నారు. సంవత్సరానికి 4–5 మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ, టాప్ హీరోయిన్ స్థాయిలో పెద్ద బ్రేక్ మాత్రం ఇంకా రాలేదు. అందం, టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాలేదని అభిమానులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం ఆమె నటించిన Housefull 5, Baaghi 4, Nikka Zaildar 4, Ek Deewane Ki Bewaniyat—అన్నీ దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లయ్యాయి. ఇదిలా ఉండగా, సోనమ్ సోషల్ మీడియాలో మాత్రం 15 మిలియన్ ఫాలోవర్స్‌ను స్టన్నింగ్ ఫోటోలతో ఎప్పుడూ ఎంగేజ్ చేస్తూనే ఉంది. తాజాగా ఆమె గోల్డెన్ స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో, బ్రౌన్ బ్యాగ్ మరియు డైమండ్ నెక్లెస్‌తో క్లిక్ చేయబడిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఓపెన్ హెయిర్, గ్లోసీ మేకప్‌తో చిరునవ్వు చిందించిన ఆమె లుక్ అందరిని ఆకట్టుకుంది. ఇక త్వరలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్ వంటి పెద్ద కాస్ట్‌తో Border 2లో హర్‌ప్రీత్ కౌర్ సేఖోన్ పాత్రలో కనిపించబోతున్నారు. కనీసం ఈ సినిమా ఆమెకు పెద్ద బ్రేక్ తెచ్చిపెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ గ్యాలరీని పంచుకోండి