రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అతి త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అతి త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఆయన భద్రతకు సంబంధించి అనేక వస్తువులను తనతో తీసుకెళ్తారు. ఇందులో ఓ పోర్టబుల్ ల్యాబ్ తో పాటు టాయిలెట్ కూడా ఉండటం గమనార్హం. ఇదే సమయంలో.. రష్యా భద్రత సంస్థ నుంచి ఒక బృందం ఇప్పటికే భారత్ కు చేరుకుందని తెలుస్తోంది. ఈ సమయంలో.. ఆయన భద్రత చర్యల గురించి పలు కీలక విషయాలు తెలుసుకుందామ్..! అవును... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4 - 5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సహజంగానే పుతిన్ వంటి శక్తివంతమైన నాయకుడికి భద్రతా ఏర్పాట్లు చాలా కఠినంగా ఉంటాయి. వాస్తవానికి ఏ దేశాధినేత అయినా మరో దేశాన్ని సందర్శించినప్పుడు ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్ ఉంటుంది. అయితే.. రష్యా అధ్యక్షుడి విషయంలో ఇది మరింత భిన్నంగా ఉంటుందనే చెప్పాలి. ఇందులో భాగంగా... ది మాస్కో టైమ్స్ నివేదిక ప్రకారం... పుతిన్ ఎక్కడకు వెళ్లినా అతని అదృశ్య సైన్యం ఆ దేశంలో లేదా ఆ ప్రాంతంలో ముందుగానే మొహరించబడుతుంది. ఈ సైన్యం అక్కడి సామాన్య ప్రజలతో, స్థానిక వాతావరణంతో కలిసిపోతుంది. ఈ సమయంలో పుతిన్ ప్రత్యేక భద్రతా బృందం.. అతని జీవితంలోని దాదాపు ప్రతీ అంశాన్ని పరిశీలిస్తాయి, నియంత్రిస్తాయి. ఇందులో అతను తీసుకునే ఆహారం నుంచి, విసర్జించే వ్యర్ధాల వరకూ ఉంటాయి!